గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..!
– 36వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కల్వ సిరి చందన
– చేతి గుర్తుకు ఓటేయాలని ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 36వార్డు కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డులోని అన్ని కాలనీల కష్టాలు తీరుస్తానని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి, యువ న్యాయవాది కల్వ సిరి చందన కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దతు దారులు ఆమె గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతు చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి సిరి చందన మాట్లాడుతూ అందరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. అందరి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డు అభివృద్ధికి నిధులు తీసుకవచ్చి.. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం వంటి పనులు చేపడుతామని అన్నారు. వార్డులో ప్రజలకు కష్టాలు లేకుండా బాధ్యతగా పనిచేస్తానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కోసం చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనేత కల్వ వంశీ, సీనీయర్ నేతలు, మహిళలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం..!