వడ్లు కొనేదాకా వదిలేదిలే..!
– కేంద్రం మెడలు వంచుదాం
– ధాన్యం కోసమే రైతు ఉద్యమం
– గ్రామస్థాయి నుంచి తీర్మానాలు
– సన్నాహాక సమావేశంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రం వరిధాన్యం కొనేదానా వదిలేది లేదు అని, బీజేపి ప్రభుత్వం మెడలు వంచేందుకు సిద్దంగా ఉండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పెలెట్ రోహిత్ రెడ్డిలు పిలుపునిచ్చారు. గురువారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కేంద్ర వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సన్నహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం తెలంగాణ రాష్ట్ర రైతులను మోసం చేస్తుందన్నారు. ఈ కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ రోడ్లపైకి వచ్చి దర్నాలు, నిరసనలు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కె కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమానికి పిలుపునిచ్చారని అన్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం రైతుల ధాన్యాలను కొనుగోలు చేసేంతవరకు కొట్లాడుదామాన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి కేంద్రం ఓర్వలేకపోతుందన్నారు. వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం మెడలు వంచైనా రైతులకు అండగా నిలబడదామన్నారు. గ్రామాలలో గ్రామసభలు, మండలాల్లో, జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ ద్వారా తీర్మాణాలు చేసి దేశ ప్రధాని మోడికి లేఖలు రాసి నిరసన తెలపాలన్నారు. పండించిన ప్రతిగింజను కొనుగోలు చేసేదాకా కేంద్రంపై ఉద్యమిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు విఠల్ నాయక్, ఉప్పరి మహేందర్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, రాజుగౌడ్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ (నయూం), మండల అధ్యక్షులు రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్ యాదవ్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, ఎంపీటీ సీల జిల్లా ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు రాములు, బషీరాబాద్ పిఎసిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, నాయకులు అజయ్ ప్రసాద్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయాదేవి, రాము, వెంకన్నగౌడ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివా స్, సంతోష్ గౌడ్, యువనాయకులు మంతన్ గౌడ్ అశోక్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

