అభివృద్ధే బీఆర్ఎస్ లక్ష్యం..!
– మెనిఫెస్టో పంచుతూ పరిమళక్క ప్రచారం
– కారు గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సమస్యలు లేకుండా చూడడంతో పాటు అభివృద్ధి చేయడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ 23వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ అన్నారు.

23వ వార్డులోని వాల్మీకీనగర్, సీసీఐ రోడ్డు ప్రాంతాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మెనిఫెస్టోను చూపిస్తూ పరిమళ ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏమేం చేస్తుంతో వివరించారు. ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. వార్డులో సమస్యలు తెలుసుకుని కమీటిల ద్వారా పరిష్కారానికి చొరవ చూపుతుందని వివరించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో వార్డులను అభివృద్ధి పథంలో నడిపించబోతుందని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల కర పత్రాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డలి రవిందర్, వార్డు నాయకులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

