సాయిపూర్‌లో కారు దూకుడు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయిపూర్‌లో కారు దూకుడు..!
– ప్రచారంలోకి పైలెట్ సతీమణి ఆర్తిరెడ్డి
– దీపా నర్సింలు గెలుపుకోసం విస్తృత పర్యటన
– ఆర్తి రెడ్డి ప్రచారానికి ఆదరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో కారు దూకుడు కొనసాగతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ప్రచారంలోకి దిగారు.

శనివారం సాయిపూర్ 9వ వార్డులో విస్తృత పర్యటన చేశారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తరుపున ప్రచారం చేశారు. అదేవిధంగా 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పట్లోళ్ల నర్సింలు గెలుపుకోసం కూడా ఆర్తిరెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆర్తి రెడ్డి దీపా నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. పట్లోళ్ల నర్సింలు, దీపా నర్సింలు గెలుపుకోసం అందరు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ప్రచారానికి మంచి ఆదరణ లభించింది.

ఇదికూడా చదవండి…

గెలిపించండి.. అన్నికష్టాలు తీరుస్తా..!