సొంత వ్యాపారానికి సర్కారు కానుక
– రూ. 3లక్షల వరకు రుణాలు పొందే చాన్స్
– నిరుద్యోగులకు వరంగా ‘రాజీవ్ యువ వికాసం’
– నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ, గడువు ఎప్పటి వరకు అంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువత సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు తెలంగాణ సర్కారు కానుక అందిచబోతోంది. స్వయం ఉపాధి పొందేందుకు రూ. 3లక్షల వరకు రుణాలు అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాజీవ్ యవవికాసం’ పేరిట నేటి నుంచి (సోమవారం) దరఖా స్తులు ఆహ్వానిస్తోంది.

ఓబీఎంఎస్ పోర్టల్లో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. గడిచిన 11 ఏళ్లుగా కార్పొరేషన్ రుణాలు లభించక నిరుద్యోగ యువత స్వయం ఉపాధికి దూరమయ్యారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఈ పథకం అర్హతలు, ఎంపిక వివరాలన్నింటిని అయా సంక్షేమ శాఖ ఆన్ లైన్ పోర్టల్లో పొందు పర్చారు. లబ్దిదారులకువ్యక్తిగతంగా గరి ష్టంగా రూ. 3లక్షల వరకుస్థానికంగా యూనిట్లు స్థాపించుకునేందుకు రుణాన్ని కార్పోరేషన్ల ద్వారా అమలు చేయనున్నారు. ఇందులో కేటగీ రిల వారీగా రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో మాదిరిగా రూ. లక్ష వరకు ఒక కేటగిరి. రూ.2-3 లక్షల వరకు మరో కేటగిరిగా వర్గీకరించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందులో 60 నుండి 70 శాతం రాయితీని అందజేస్తారు. వచ్చే నెల 6 నుంచి 31 వరకు ఆన్లైన్ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదికూడా చదవండి…

