గులాబీ రెపరెపలు..
– ఘనంగా టీఆర్ఎస్ జెండా పండగ
– వాడ వాడల జెండా ఎగురేసిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్‌లో గులాబీ జెండా రెపరెపలాడింది. గురువారం తాండూరు టీఆర్ఎస్ నాయకులు జెండా పండగను ఘనంగా జరుపుకున్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాసం ముందు పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ వార్డు కౌన్సిలర్ విజయదేవీతో కలిసి జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ 9 వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా ఎగురేశారు.
32 వ వార్డులో కౌన్సిలర్ లతా సుమిత్‌గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ సుమిత్‌గౌడ్‌లు జెండా ఆవిష్కరించారు. 11 వ వార్డులో టీఆర్ఎస్ మహిళ పట్టణ అధ్యక్షురాలు అనురాధ రవిందర్ జెండా ఆవిష్కరించారు.
34వ వార్డులో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారీ ఆధ్వర్యంలో గులాబీ జెండాను ఎగురవేశారు. 15 వ వార్డులో టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి టీఆర్ఎస్ నాయకులు సంజీవరావుతో కలిసి జెండా ఎగురేశారు. 26వ వార్డులో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ జెండా ఆవిష్కరించారు. 13వ వార్డులో టీఆర్ఎస్ నాయకులు హరిహరగౌడ్ జెండా ఎగురేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు తెలంగాణ జాతిపిత ఫ్రోఫెసర్ జయంశంకర్ సారు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపించి జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమాల్లో తాండూరు మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, రాజుగౌడ్, శ్రీనివాస్ చారీ, మసూద్, బంటు మల్లప్ప, బీదర్ రాజశేఖర్, ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్, భద్రేశ్వారాలయ మాజీ చైర్మన్ బంటారం సుధాకర్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి, న్యాయవాది గోపాల్, టీఆర్ఎస్ యువనాయకులు బిడ్కర్ రఘు, టీఆర్ఎస్‌వై పట్టణ అధ్యక్షులు రాకేష్ తాండ్ర, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు దత్తాత్రేయ, అశోక్ మదిరాజ్, టైలర్ రమేష్, శివానంద్, సోమనాథ్, ప్రశాంత్ కులకర్ణి, ఇంతియాజ్, గౌస్, అహమ్మద్, మీర్జా వాహీద్, సతీష్, సాగర్ గౌడ్, వార్డుల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇంకా ఫోటోల కోసం ఈ కింద చూడండి..