రోహిత్ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

రోహిత్ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి
– కాంగ్రెస్‌ యువ నాయకులు కావలి సంతోష్‌ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నుంచి తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బర్త్‌రఫ్‌ చేయాలని తాండూరు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కావలి సంతోష్ కుమార్ అన్నారు.

ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మోయినాబాద్‌ ఫాంహౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ ఆరోపణలు రావడంపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా రోహిత్ రెడ్డిపై డ్రగ్స్‌ విషయంలో ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. రోహిత్ రెడ్డిపై డ్రగ్స్‌ విషయంలో ఆరోపణలు రావడం అవమానించే విధంగా ఉన్నాయని అన్నారు. ప్రజలు పరిమాణాలపై ఆందోళన చెందుతున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

భద్రేశ్వరుని ప్రతిష్ట పెంచాలి