హ్యాపీ బర్త్ డే బాబన్న..!
– శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వర్గీయ మాజీ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోదరుడు, తాండూరు సీటీ కేబుల్ ఎండీ గొట్టుగా నర్సింహ రెడ్డి (బాబు)కు శుభాకాంక్షల వెల్లు వ కొనసాగింది.

ఆదివారం నర్సింహ రెడ్డి జన్మదిన నిరాడంబరంగా జరిగింది. సందర్భంగా తాండూరుకు చెందిన పలువురు నాయకులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు హైదరాబాదులో నర్సింహ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నర్సింహ రెడ్డికి పుష్ప గుచ్చాలు అందించి.. శాలువాలతో సన్మానించారు.

సందర్భంగా పలువురు మాట్లాడుతూ నర్సింహ రెడ్డి మంచి మనసున్న నాయకుడు అని కొనియాడారు. ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో, వ్యక్తిగతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని.. రాజకీయంగా.. సామాజిక సేవా రంగంలో ఉన్నతమైన సేవలను అందించాలని ఆకాంక్షించారు.

నర్సింహ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో గోట్టుగా రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నాయకులు నాగప్ప, సిహెచ్ అశోక్, ఆప్తులు శ్రేయోభిలాషులు తదితరులు ఉన్నారు.


