కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి
– మున్సిపల్‌ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికుల తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో హైదరాబాద్‌ కు చెందిన పాత కింగ్, యశోధ ఆసుపత్రి వారి సౌజన్యంతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ నీరజా బాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె కూడా కార్మికులతో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

ఆమె మాట్లాడుతూ ప్రతి కార్మికుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి అని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలని ఆమె వివరించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ రాకేష్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రాములు, యశోద హాస్పిటల్ కార్పొరేట్ రిలేషన్స్ డిప్యూటీ మేనేజర్ ఎన్.శ్రీధర్, డాక్టర్లు వీరారెడ్డి, అఖిల్, నీలోఫర్, కౌన్సిలర్లు జుంటుపల్లి వెంకటేష్, పలువురు నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమాజ భదత్ర.. అందరి బాధ్యత