సమాజ భదత్ర.. అందరి బాధ్యత

తాండూరు రాజకీయం వికారాబాద్

సమాజ భదత్ర.. అందరి బాధ్యత
– విద్యార్థులు, యువత చైతన్య వంతులు కావాలి
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
– తాండూరులో రక్షణ నేత్రం, సురక్ష మిత్రపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ భద్రత అందరి బాధ్యత అని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు.

శనివారం తాండూరు పట్టణం వినాయక కన్వెన్షన్‌ హాల్‌లో తాండూరు సబ్‌ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్షణ నేత్రం – సురక్ష మిత్రపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా హాజరయ్యారు. ఈ సందర్బంగా రక్షణ నేత్రం – సురక్ష మిత్రకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, విద్యార్థుల భద్రత, నేరాల నియంత్రణ కోసం రక్షణ నేత్రం – సురక్ష మిత్ర కార్యక్రమాలను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. సమాజ భద్రత కోసం యువత, విద్యార్థులు చైతన్య వంతులు కావాలని అభిలాషించారు.

ప్రజలు నేరాల నియంత్రణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, కమీషనర్ రాజేష్ రెడ్డి, కౌన్సిలర్లు జంటుపల్లి వెంకట్, దివిటి ఎల్లప్ప, తాండూరు పట్టణ సీఐ పరమేష్, ఎస్‌ఐలు విట్టల్ రెడ్డి, నుమన్ అలీ, వినోద్ రాథోడ్, ప్రశాంత్ వర్ధన్, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కుల వృత్తుల పరిరక్షణలో విఫలం