వాహనాలకు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు ఈజీ..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

వాహనాలకు లైసెన్స్‌, రిజిస్ట్రేషన్లు ఈజీ..!
– పర్మిట్లు సహా అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే
– ఎలా ఉపయోగతులో తెలుసుకోండి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే వాటికి సంబంధించి లైసెన్స్‌లు పొందడి, రిజిస్ట్రేషన్లను చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

తెలిసిన వారు కూడా ఆఫీసుల చుట్టూ తిగాల్సి వస్తుందని ఆందోళన పడుతున్నారు. వాహన్ మరియు సారథి పోర్టల్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ వేదికలుగా ఉన్నాయి.. ఇవి వాహన రిజిస్ట్రేషన్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ సేవలను అందిస్తాయి.

అయితే రవాణా శాఖ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన డిజిటలైజేషన్ ఫలితంగా వాహన్, సారథి పోర్టళ్ల ద్వారా లైసెన్స్‌, రిజిస్ట్రేషన్ల సేవలు సులభంగా అందుతున్నాయి. కాని వీటిపై అవగాహన లేకపోవడంతో ఉపయోగాలు తెలుసుకోలేకపోతున్నారు.

ఈ పోర్టళ్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్, అడ్రస్ మార్పు, వాహన యాజమాన్య బదిలీ, రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, పర్మిట్ల జారీ వంటి సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పన్నులు, ఫీజులు, జరిమానాల చెల్లింపులు కూడా డిజిటల్ విధానంలోనే స్వీకరిస్తుండటంతో కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తీరడం ఖాయం. డిజిటల్ సేవల అమలుతో పారదర్శకత పెరగడంతో పాటు సేవలందించే ప్రక్రియ వేగవంతమై ప్రజలకు సమయం, వ్యయం రెండూ ఆదా అవుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ భూములను కాపాడండి..!