ఫ్రెండ్‌షిఫ్ డే రోజు రీయూనియన్
– 25ఏండ్ల తరువాత పూర్వవిద్యార్థుల సమ్మేళనం
– గురువులకు సన్మానం, ఆటపాటలతో ఉత్సహాం
పెద్దెముల్, దర్శిని ప్రతినిధి: స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దెముల్ జెడ్పీహెచ్‌ఎస్ (బాలుర) పాఠశాలకు చెందిన 2000–01 విద్యా సంవత్సరపు పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

దాదాపు పాతికేళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న స్నేహితులు పాఠశాల రోజుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా విద్యార్థి దశలో జరిగిన విశేషాలు, ఉపాధ్యాయుల బోధన, స్నేహితులతో గడిపిన మధుర అనుభవాలను పరస్పరం గుర్తు చేసుకున్నారు.

తమ జీవితానికి బాటలు వేసిన గురువులు గాల్లయ్య, ఆనంద్ కుమార్, సుభాన్ రెడ్డి, హన్మంత్‌లను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి సమ్మేళనాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ పరస్పర అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పూర్వ విద్యార్థులు నిర్ణయించారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో ఉత్సాహంగా సాగింది.


