మచ్చలేని నాయకుడు మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మచ్చలేని నాయకుడు మనోహరన్న..!
– ఎమ్మెల్యే బర్త్ డే రోజు మొక్కల నాటడం అభినందనీయం
– కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మచ్చలేని నాయకుడిగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ అన్నారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 24వ వార్డులో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌన్సిలర్ బాలకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎప్పటికీ ప్రజల మనుషుల్లో మచ్చలేని నాయకుడిగా నిలుస్తారని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్, ఎబినేజర్, రఘు పటేల్, రాజశేఖర్ రెడ్డి, వార్డు యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఆరోగ్యంపై దృష్టి..!