సురక్షిత ప్రాంతాలలో ఉండటమే మేలు
– మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్ రజాక్
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండటమే మేలు అని తాండూరు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్, 29వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు వార్డులో పర్యటించి పురాతన నివాసాలను పరిశీలించారు. వార్డులో పురాతన ఇంట్లో నివసిస్తున్న కుటుంభ సభ్యులను కలిసి మాట్లాడారు. భారీ వర్షాలు కురుస్తున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

