అంబరాన్నింటిన బోనాల సంబరాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబరాన్నింటిన బోనాల సంబరాలు..!
– శ్రీ నేతాజీలో ఆషాఢం వేడుకలు
– ఉర్రూతలూగించిన పోతురాజులు
– బోనాలతో విద్యార్థుల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్‌లో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి.

ఆషాఢం మాసంను పురస్కరించుకుని శుక్రవారం పాఠశాలలో సంబరాలు జరుపుకున్నారు. పాఠశాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పాఠశాల విద్యార్థిని అమ్మవారం వేషాధారణ, విద్యార్థులు పోతురాజు వేషాధారణలో ఆకట్టుకున్నారు. పలువురు విద్యార్థులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దరువుల మద్య పోతురాజులు ఊగిపోతూ ఉర్రూతలూగించారు.

ఆట పాటలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మణిమాల, యజమాన్య సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి కృతజ్ఞతార్పణగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో గురుకుల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.

తాండూరు అభివృద్దికి మెరుగైన సేవలందించండి..!