నేతల జన్మదినోత్సవంలో బీఎస్‌ఆర్ సందడి
– శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– మాజీ చైర్ పర్సన్, సీనీయర్ నేతల ఇంటికి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రాజకీయ నేతల జన్మదినోత్సవాలతో ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు.

శుక్రవారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త, సీనీయర్ నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ రవూఫ్ జన్మదినం వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి స్వప్న పరిమళ్, అబ్దుల్ రవూఫ్ నివాసాలకు వెళ్లారు. వారికి బొకేలు అందించి.. సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

అదేవిధంగా ఇలాంటి వేడుకలు, పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, సీనీయర్ నాయకలు బంటు మల్లప్ప, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు, యువనాయకులు సుదర్శన్ గౌడ్ తదితరులు ఉన్నారు.


