రాజీవ్ కాలనీకి రాజయోగం పట్టిస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాజీవ్ కాలనీకి రాజయోగం పట్టిస్తాం..!
– త్వరలో రూ.25 లక్షల నిధులతో అభివృద్ధికి శ్రీకారం
– దశల వారిగా జంట కాలనీల అభివృద్ధిపై దృష్టి
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు రాజయోగం పట్టిస్తామని చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు.

త్వరలో రూ.25 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 8వ వార్డులో ఆమె మున్సిపల్ కమీషనర్ రాకేష్‌ రెడ్డి, వార్డు కౌన్సిలర్ జావిద్ తదితరులతో కలిసి పర్యటించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అధికారులకు అక్కడికక్కడే అవసరమైన సూచనలు చేశారు. అనంతరం చైర్‌పర్సన్ మాట్లాడుతూ, వార్డులో అత్యవసర అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. త్వరలో రూ.25 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, మిగిలిన పనులను దశలవారీగా చేపడతామని వెల్లడించారు.

వార్డులో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రతిపాదనలను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు సమీకరించి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజీవ్ ఇందిరమ్మ కాలనీల ఏర్పాటుతో పాటు వాటి అభివృద్ధిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, ఏఈ నందిని, పార్టీ నాయకులు సాయప్ప, జిలాని, స్థానికులు తదితరులు ఉన్నారు.

విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి