మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కృషి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి అసోసియేషన్ కార్యాలయంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో అసోసియేషన్ సభ్యులు తన గెలుపుకు సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో ముస్లిం అసోసియేషన్ కు హామి ఇచ్చిన విధంగా అసోసియేషన్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు.
అదేవిధంగా పాత తాండూరు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీ గౌడ్, అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, సభ్యులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

