మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం

తాండూరు రాజకీయం వికారాబాద్

మిలాద్‌ ఉన్ నబీలో మతసామరస్యం
– పాత తాండూరులో ఘనంగా వేడుకలు
– హాజరైన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాత తాండూరులో మిలాద్‌ ఉన్ నబీ వేడుకలలో మత సామరస్యత వెల్లివిరిసింది. బుధవారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టి పండుగ సందడి చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంజీవ్ రావు, సంతోష్ గౌడ్ హాజరై ముస్లిం సోదరులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూరులో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను సోదరభావంతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పట్టణంలో కొనసాగుతున్న మతసామరస్యం, ఐక్యత భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

మిలాద్‌ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, యువకులు, స్థానికులు పాల్గొన్నారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత వద్దు..!