అక్రమ ఇసుక రవాణాకు చెక్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

అక్రమ ఇసుక రవాణాకు చెక్..!
– రూ.600కే ట్రాక్టర్ ఇసుక పర్మిషన్
– తాండూరులో 7 లభ్యత కేంద్రాల గుర్తింపు
– నిబంధనలకు విరుద్ధంగా తరిలిస్తే కేసులు
– తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు దృష్టిసారించడం జరిగిందని ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీఎస్సీ, సబ్ డివిజన్ పోలీసు, మైన్స్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణాకు కళ్లెం వేయడం జరుగుతుందన్నారు. ఇకనుంచి ఎవరికైనా ఇసుక అసరమైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరలించాల్సి ఉంటుందన్నారు.

నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లో నదీ ప్రవాహక ప్రాంతాల్లో మొత్తం 7 ఇసుక లభ్యత కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. తాండూరు. మండలంలో పాత తాండూరు, వీర్ శెట్టిపల్లి, ఖాంజాపూర్, బషీరాబాద్ మండలంలో నావంద్గి, గంగ్వార్, పెద్దేముల్ మండలంలో రేగొండి, కొండాపూర్ గ్రామాల్లోని కాగ్నా వాగుల వద్ద ఈ కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి పాత తాండూరు, వీర్ శెట్టిపల్లి, ఖాంజాపూర్, నావంద్గి, రేగొండిలోని కేంద్రాలలో ఇసుక లభ్యత ఉందన్నారు. తాండూరు మున్సిపల్లో గాని, మండలాల్లో గాని ఎవరికైనా ఇసుక అవసరమైతే ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లో ఒక ట్రాక్టరుకు రూ.600లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అదేవిధంగా ఎంతటి వారైనా అక్రమ ఇసుక రవాణకు పాల్పడితే సహించేది లేదన్నారు. అనుమతులు లేకుండా తరలించే వాహనాలపై దృష్టిసారించాలని, రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించాలని పోలీసులను ఆదేశించడం జరిగిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా సాగిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మైన్స్ ఏడీ జాకబ్, డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాంబాబు, తహసీల్దార్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!