టీబీబీఎల్‌లో బీఎస్ఆర్‌ టీం బోణీ..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

టీబీబీఎల్‌లో బీఎస్ఆర్‌ టీం బోణీ..!
– బాజిగర్‌ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం
– బీఎస్‌ఆర్ జట్టులో ఉత్సాహాం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో జరుగుతున్న తాండూర్‌ బిగ్‌ బాష్‌ లీగ్‌ (టీబీబీఎల్‌) క్రికెట్‌ టోర్నమెంట్‌లో బీఎస్ఆర్‌ టీం విజయంతో శుభారంభం చేసింది.

టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో బాజిగర్‌ జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి.. గెలుపు బోణి కొట్టింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బాజిగర్‌ జట్టు బీఎస్ఆర్‌ బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే పరిమితమైంది.

నిర్ణీత 8 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 39 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బీఎస్ఆర్‌ టీం దూకుడుగా ఆడింది. కేవలం 3.4 ఓవర్లలోనే 41 పరుగులు సాధించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

తక్కువ ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బీఎస్ఆర్‌ టీం సత్తా చాటడంతో మైదానంలో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించడంతో బీఎస్ఆర్‌ జట్టు శిబిరంలో ఆనందం వ్యక్తమైంది.

Pvr

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..!