రాములు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన బురుగుపల్లి రాములు(35) మృతి చెందారు. ఆదివారం పొలానికి వెళ్లగా మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు నీటిలోపడి మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తిమ్మాయిపల్లి గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంభీకులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, యాలాల మండల పార్టీ అధ్యక్షులు సిద్రాల శ్రీనివాస్, సర్పంచ్ బసిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వడ్డె రాములు, దెవనూర్ వెంకటయ్య, ఎంపీటీసీ లక్ష్మప్ప, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్, గ్రామస్తులు తదితరులున్నారు.
