గుణాత్మక విద్యే సర్కారు ధ్యేయం
– ప్రభుత్వ బడుల పురోగతిపై దృష్టి
– పాఠ్యపుస్తకాలతో శ్రద్దగా చదువుకోవాలి
– ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కార్పోరేట్‌కు ధీటుగా సర్కారు బడుల్లోనే పేద విద్యార్థులకు గుణాత్మక విద్యనందించడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు మండల ఎంపీపీ అనితా రవిందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజులలు అన్నారు. గురువారం మండలంలోని మల్కాపూర్, కోటబాస్పల్లి, కరణ్ కోట్ గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ నిర్వంహించారు.

ఈ కార్యక్రమాలకు ఎంపీపీ అనితా రవిందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజులలు హాజరై వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రామ్ రెడ్డి, సర్పంచులు విజయలక్ష్మీ పండరి, కుర్వ నాగార్జునలతో కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీలు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. దీంతో పాటు మన ఊరు – మన బడి కార్యక్రమంతో పాఠశాలల పురోగతిపై దృష్టిసారిస్తుందన్నారు. పాఠశాలల్లో మౌళిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం అందజేసిన పాఠ్యపుస్తకాలతో విద్యార్థులు శ్రద్దగా చదువుకోవాలన్నారు.
మరోవైపు పదో తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పీఆర్టీయూ ఆధ్వర్యంలో వెండి పతకాలను అందజేసి సన్మనించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, విద్యాధికారి వెంకటయ్య గౌడ్, హెచ్ఎంలు వైద్యనాథ్, శ్రీనివాస్, మృత్యుంజయ స్వామి, పీఆర్టీయూ నాయకులు నాగప్ప, జైపాల్ రెడ్డి, పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్ చారి, బాలకృష్ణ, టీచర్లు శ్రీధర్, మోహన్, స్వప్ననాయకులు పండరి, గ్రామాల పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



