నొప్పులపై ప్రత్యేక వైద్య శిబిరం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్

నొప్పులపై ప్రత్యేక వైద్య శిబిరం..!
– తాండూరులో ఫస్ట్ టైమ్ ఫ్రీ కన్సల్టెన్సీ
– భుజం నుంచి మోకాలి వరకు.. దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక పరీక్షలు
– నరాల బ్లాక్స్‌, ప్రత్యేక ఇంజెక్షన్ల ద్వారా నొప్పుల నివారణకు వైద్య సలహాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తాండూరులో తొలిసారిగా నొప్పుల సమస్యలపై ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు.

పట్టణంలోని సాయిపూర్‌ రోడ్డులో ఉన్న ఆదిత్య ఆసుపత్రిలో అక్టోబర్‌ 17న శనివారం ఈ ఫ్రీ కన్సల్టెన్సీ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. నొప్పుల నివారణ చికిత్సలో నిపుణులైన డాక్టర్‌ కౌశిక్‌ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యకు అనుగుణంగా తగిన సలహాలు అందించనున్నారు.

నొప్పుల సమస్యలపై ప్రత్యేక పరీక్షలు
భుజం నొప్పి, భుజం పట్టేయడం, మోచేతి నొప్పి, దీర్ఘకాలిక నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, అరికాలి నొప్పులతో బాధపడుతున్న వారికి ఈ శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సాధారణ చికిత్సలతో ఉపశమనం లభించని దీర్ఘకాలిక నొప్పులకు గల కారణాలను గుర్తించేందుకు వైద్యుల సలహా పొందే అవకాశం కల్పిస్తున్నారు. అవసరాన్ని బట్టి ప్రత్యేక నొప్పుల నివారణ చికిత్సలు, పీఆర్పీ ఇంజెక్షన్లపై కూడా వైద్య సలహాలు అందించనున్నారు.

ఆధునిక విధానాల్లో నొప్పుల నివారణ చికిత్సలు
ఈ శిబిరంలో రోగుల సమస్యలను బట్టి పలు ప్రత్యేక వైద్య విధానాలపై సలహాలు అందించనున్నారు.

వాటిలో అల్ట్రాసౌండ్‌ మార్గదర్శకత్వంలో నరాల బ్లాక్స్‌ చికిత్స, ఎపిడ్యూరల్‌ బ్లాక్స్‌, కీళ్లలోకి ఇంజెక్షన్లు, సీ-ఆర్మ్‌ మార్గదర్శకత్వంలో ఇంజెక్షన్లు, అల్ట్రాసౌండ్‌ సహాయంతో భుజం కదలికలను మెరుగుపరిచే హైడ్రోడీలిటైజేషన్ విధానం ఉన్నాయి. ఈ విధానాలు రోగి ఆరోగ్య పరిస్థితి, నొప్పి తీవ్రత, వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైనప్పుడు మాత్రమే సూచిస్తారు.

నొప్పుల చికిత్సలో నిపుణుడితో పరీక్షలు
డాక్టర్‌ కౌశిక్‌ ఎంబీబీఎస్‌తో పాటు మత్తుమందు వైద్యంలో పీజీ, నొప్పుల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరం దీర్ఘకాలిక నొప్పులతో ఇబ్బందులు పడుతున్న వారికి వైద్య సలహాలు పొందేందుకు ఉపయోగకరంగా ఉండనుంది. నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకుని, సమస్యకు తగిన చికిత్సపై నిపుణుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ కోసం: 9493684848, 9391198408 సంప్రదించాలని సూచించారు.

Pvr

ఎమ్మెల్యేతో విభేదాలు లేవు..!