వ్యాపారి ఖాతాలో కోట్లు

తాండూరు తెలంగాణ వికారాబాద్

వ్యాపారి ఖాతాలో కోట్లు
– షాక్‌కు గురైన ఖాతాదారుడు
– బ్యాంకు అధికారుల‌కు స‌మాచారం
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఇటీవ‌ల చెన్న్‌లో ఓ 100 మంది ఖాతాలో భారీగా డ‌బ్బులు కెడ్రిట్ అయ్యాయి. ఇలాంటి సంఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. వికారాబాద్ జిల్లాలోని HDFC శాఖ‌ ఖాతాదారుని అకౌంట్లో భారీగా డబ్బు జమైంది. వెంకట్ రెడ్డి అనే వ్యాపారి ఖాతాలో రూ. 18.52 కోట్లు పడ్డాయి. దీంతో ఆయన వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే, బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేయడంతో, ఇలా జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు అతని ఖాతాను హోల్డ్ చేశారు. అక్కడ చెన్నైలో.. ఇక్కడ మన దగ్గర… బ్యాంకు ఖాతాల్లో కోట్లలో డబ్బులు జమ కావడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బ్యాంకు ఖాతాదారులు ఫెడరల్ క్రైమ్ అండ్ బ్యాంక్ ప్రాడ్ విభాగానికి కంప్లైంట్ చేయడం వల్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు ఇంటర్నెట్ సర్వీసు హ్యాక్ చేసి ఎవరైనా నగదు బదిలీ చేసి ఉంటారనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. మరో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఒక మొబైల్ షాప్ నిర్వాహకుడి ఖాతాలో కూడా భారీగా నగదు జమయింది. సుమారు ఐదు కోట్ల ఎనిమిది లక్షలు డిపాజిట్ అయ్యే సరికి… షాకయ్యాడు HDFC ఖాతాదారు ఇల్లెందుల సాయి. కానీ ఐదు గంటల్లోనే జమయిన డబ్బంతా మాయమైయ్యాయి. సాంకేతిక సమస్యే కారణమని, ఎటువంటి గడబిడా లేదని చెబుతున్నారు బ్యాంకు అధికారులు.