దుమ్ములేపిన బీఎస్ఆర్‌ టీమ్‌..!

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

దుమ్ములేపిన బీఎస్ఆర్‌ టీమ్‌..!
– టీబీబీఎల్‌ సీరీస్‌ కప్‌ కైవసం
– ఫైనల్లో 58 పరుగుల తేడాతో ఘన విజయం
– విన్నర్స్‌కు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్వహించిన తాండూరు బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ (టీబీబీఎల్‌)లో బీఎస్ఆర్‌ టీమ్‌ సత్తా చాటింది.

ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో అమాన్‌ సీసీ జట్టుపై 58 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం ప్రతిభ కనబరిచిన జట్టు తుది పోరులోనూ ఆధిపత్యం ప్రదర్శించి విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో బీఎస్ఆర్‌ జట్టు కెప్టన్ వినయ్‌ రాజ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

పార్థ మేష్‌ ఠాక్రీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును అందుకున్నాడు. ట్రోఫీ సాధించిన అనంతరం బీఎస్ఆర్‌ జట్టు సభ్యులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన విజేత జట్టుకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షించారు. తాండూరులో క్రీడాభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జట్టు ప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

Pvr

కరణ్‌ కోట్ ఎస్‌ఐగా అన్వేష్ రెడ్డి