శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వాసుప‌వార్ నాయ‌క్

తాండూరు వికారాబాద్

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వాసుప‌వార్ నాయ‌క్
– 30 మంది గిరిజ‌నుల‌తో క‌లిసి ద‌ర్శ‌నం
తాండూరు రూర‌ల్, ద‌ర్శిని ప్ర‌తిధి: తాండూరు మండ‌లం అంతారం తాండ భూకైలాస్ వ్య‌వ‌స్థాపకులు వాసుప‌వార్ నాయ‌క్ తిరుమ‌ల‌లో వెల‌సిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. తాండాకు చెందిన 30 మంది గిరిజ‌నుల‌ను వాసుప‌వార్ నాయ‌క్ విమానంలో తిరుప‌తికి తీసుకెళ్లారు. సోమ‌వారం రాత్రి వారితో క‌లిసి వాసు ప‌వార్ నాయ‌క్ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. వాసు ప‌వార్ వెంట గిరిజ‌నులు మాట్లాడుతూ రైల్లో తిరుప‌తి వెళ్లేందుకు ఇబ్బందులు ప‌డే మాకు విమానంలో వాసుప‌వార్ నాయ‌క్ తీసుక‌వెళ్ల‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు.