చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
– ఆత్మరక్షణకు తైక్వాండో తోడ్పాటు
– క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– రాష్ట్ర స్థాయి తైక్వాండో టోర్నమెంట్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరులో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్‌) వికారాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో టోర్నమెంట్ చాంపియన్ షిప్ పోటీలు ఉత్సహాంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని తులసీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన టోర్నమెంట్ కు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

అండర్-14, అండర్-17 విభాగంలో బాల బాలికలు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ కు రాష్ట్రంలోని అదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, నిజాబాద్, మెదక్ తో పాటు పది జిల్లాల నుంచి తైక్వాండో క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరులో తైక్వాండో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తైక్వాండో అందరి ఆత్మరక్షణకు తోడ్పడుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో పాల్గొన్న క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.

మరోవైపు ఎసీజీఎఫ్ కమిటి సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం అండర్-14, శనివారం అండర్-17 విభాగాలలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్. తాండ్ర రాకేష్, ఎసీఎఫ్ జిల్లా కమిటి, డివిజన్ కమిటి సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం