విద్యార్థినులకు ఆనందాన్ని పంచిన మార్వాడి యువ మంచ్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యార్థినులకు ఆనందాన్ని పంచిన మార్వాడి యువ మంచ్‌..!
– కోట్‌పల్లి కేజీబీవీలో బాలికలతో ముందస్తు దీపావళి వేడుకలు
– మంచ్ మంచి తనానికి మైమరిచి పోయిన విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పండుగ ఆనందం అందరికీ అందాలనే లక్ష్యంతో మార్వాడి యువ మంచ్‌ తాండూరు శాఖ కోట్‌పల్లి కేజీబీవీ విద్యార్థినులతో ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించింది.

బాలికలతో కలిసి పండుగను జరుపుకుంటూ స్వీట్లు పంపిణీ చేసి, వారిలో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్వాడి యువ మంచ్‌ జాతీయ కన్వీనర్‌ మన్మోహన్‌ సార్డా మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం పాఠశాల బాలికలతో దీపావళి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు.

విద్యార్థినులు కష్టపడి చదివి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో టాపర్లుగా నిలవాలని ఆకాంక్షించారు. వారి విద్యాభివృద్ధికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులకు చక్కటి విద్యాబోధన అందిస్తున్న ప్రత్యేక అధికారిణి పల్లవి, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. బాలికలు ఉత్సాహంగా వేడుకల్లో భాగస్వాములయ్యారు.

అదేవిధంగా భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భవిష్యత్తులో నీటి ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థినులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువ మంచ్‌ తాండూరు శాఖ అధ్యక్షుడు కిషన్‌ గోపాల్‌ రాఠి, సోషల్‌ వర్కర్‌ కేవీఎం వెంకట్‌, కార్యదర్శి కరణ్‌ జైన్‌, కోశాధికారి భరత్‌ దేవుడా, రాష్ట్ర కన్వీనర్‌ అనిల్‌ సార్డా, జాతీయ జాయింట్‌ సెక్రటరీ రోహిత్‌ అగర్వాల్‌, శాఖ సభ్యులు పవన్‌ సోని, నిఖిల్‌ గగరాని, కిషన్‌ బూబ్‌, నిహార్‌ సోమాని, ముఖేష్‌ సోమాని, రోహిత్‌ సోని, మధుసూదన్‌ సార్డా, ఆశిష్‌, దీపక్‌ బూబ్‌, దినేష్‌ పర్తాని, పాఠశాల ప్రత్యేక అధికారిణి పల్లవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న కార్మికుడికి చైర్‌పర్సన్‌ చేయూత