ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య..!
– కడుపునొప్పి భరించలేక ఘాతుకం
– బషీరాబాద్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: కడుపునొప్పి వివరించలేక ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యపాల్పడ్డాడు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం నీళ్ళపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన ఆలస్యంగా వీధిలోకి వచ్చింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన సాగర్ (25) అనే యువకుడు గత ఆరు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితం అతని తల్లిదండ్రులు అనారోగ్యానికి గురి కావడంతో తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాగర్ కడుపునొప్పి సమస్యను తలచుకొని మనవేదనకు గురయ్యాడు.

 

ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గత రెండు రోజులుగా తమ్ముడు ఇంటి నుంచి బయటకు రావడంలేదని అనుమానం వచ్చిన అన్న ఇంట్లో వెళ్లి చూడగా.. సాగర్ దూలానికి వేలాడుతూ విగతాజీవిగా కనిపించాడు. స్థానికుల సాయంతో బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రి మార్చరికి తరలించారు. సాగర్ కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా కడుపునొప్పి సమస్యతోనే సాగర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి..

ఇందిరమ్మ ఇళ్లకు జియో ఫెన్షింగ్…!