కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
– తాండూరులో 67 కరోనా కేసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కొన్ని రోజులుగా కేసులు తగ్గినా కేసులు మాత్రం తటస్థంగా నమోదవుతున్నాయి. గురువారం తాండూరు ప్రాంతంలో 67 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో 251 మందికి నిర్వహించిన పరీక్షల్లో 57 మందికి, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో 62 మందికి నిర్వహించిన పరీక్షల్లో 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పీపీ యూనిట్ ఇంచార్జ్ డాక్టర్ బాస్కర్ తెలిపారు. కేసులకు అనుగుణంగా కరోనా కేసులు పరీక్షల సంఖ్యను పెంచడం జరిగిందని, లక్షణాలు ఉన్న వారు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు సోమవారం 289 మందికి పరీక్షలు నిర్వహించగా 76 పాజిటివ్ కేసులు, మంగళవారం 351 మందికి పరీక్షలు నిర్వహించగా 95 పాజిటివ్ కేసులు, బుధవారం 292 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా 61 మందికి పాజిటివ్ నమోదు కావడంతో వారంతా ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

