కానిస్టేబుల్ ప్రిలిమినరీకి అంతా రెడి

కెరీర్ తాండూరు వికారాబాద్

కానిస్టేబుల్ ప్రిలిమినరీకి అంతా రెడి
– తాండూరులో 28 ప‌రీక్షా కేంద్రాలు
– గంట‌ముందే రావాలి, నిమిషం లేటైనా నో ఎంట్రి
– తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పోలీసుశాఖ‌లో ఖాళీ భ‌ర్తికోసం ఈ నెల 28న నిర్వ‌హించే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు అంతాసిద్దం చేసిన‌ట్లు జ‌రిగిందని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను దృష్టిలో ఉంచుకుని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, పెద్దేముల్, తదితర ప్రాంతాలలో 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు తాగునీరు, విద్యుత్, వెలుతురు, గాలి వచ్చే సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్షలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్య మైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకోవడం జరుగుతుందని, కావున అభ్యర్థులు గొ రింటాకు, మెహెందీ వంటివి వేసుకోరాదని సూచించారు. సమయానికి చేరుకుని పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, నిబంధనలను పాటించి విజయవంతానికి సహ‌కరించాలని అన్నారు.