వజ్రోత్సవాలు అంబరాన్నంటాలి
– ఇంటింటిపై త్రివర్ణం ఎగరాలి
– ప్రతి కార్యక్రమం విజయవంతం చేయండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా చేపడుతన్న వజ్రోత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భాతర దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గుర్తుండి పోయేలా సీఎం కేసీఆర్ వత్రోత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగిరేలా చూడాలన్నారు. ఏరోజుకు ఆరోజు ప్రకటించిన విధంగా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల వె కు అందరు గాంధీజీ చిత్రాన్ని వీక్షించాలన్నారు. గురువారం ఫ్రీడమ్ రన్, 12న జాతీయ రక్షాబందన్ ఒకే దగ్గర 75 మంది స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వ* వాంచాలన్నారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన, బాణాసంచాలు, బెలూన్లు ఎగురవేస్తూ కనివిని ఎరుగని రీతిలో వజ్రత్సవాలను నిర్వహించాలన్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ కొత్తగా అమలు చేయబోతున్న 10 లక్షల మందికి ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, సాదీముభారక్, రైతు బందు, రైతు బీమా వంటి పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
భారీగా సీఎం సభకు కార్యకర్తలను తరలించాలి

మరోవైపు ఈనెల 14న వికారాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే’ రోహిత్ రెడ్డి నేతలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంతో పాటు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్వహించే భారీ సభకు నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలను తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి. అధికార ప్రతినిధి రాజుగౌడ్. యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మండల పార్టీల అధ్యక్షులు రాందాస్, రవీందర్ రెడ్డి, రైతు సమితి కోఆర్డినేటర్ రాంలింగారెడ్డి, కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు



