కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ అండ
– మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కేపీఆర్
– పటేల్ చింత తాండాలో కార్యకర్త కన్నుమూత
యాలాల, దర్శిని ప్రతినిధి: కార్యకర్త కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు(కేపీఆర్) భరోసా ఇచ్చారు. బుధవారం యాలాల మండలం జుంటుపల్లి పటేల్ చింత తాండాకు చెందిన టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కిషన్ నాయక్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న కరణం పురుషోత్తంరావు గ్రామానికి చేరుకున్నారు. కిషన్ నాయక్ పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కరణం పురుషోత్తంరావు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. కిషన్ నాయక్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా అందించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జుంటుపల్లి సర్పంచ్ వెంకట్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రామారావు, నాయకులు ముకుంద్ గౌడ్ తదితరులు ఉన్నారు.


