తాండూరు కారు పార్టీలో మంటలు
– ఆధిపత్యం కోసం నాయకులు
– అయోమయంలో అనుచరులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మునిసిపల్ ఎన్నికలవేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ లో ఆధిపత్యం కోసం ముఖ్య నాయకులు పోటీ పడుతుంటే వారి మధ్య ఎగసిపడుతున్న మంటల మధ్య మేము కాలిపోతున్నామంటూ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద మున్సిపాలిటీలలో ఒకటిగా ఉన్న తాండూరులో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

మెజారిటీ మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడం గమనార్హం. అయితే గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ కు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య తీవ్రమైన గ్రూపు తగాదాలు ఉండడంతో తాండూరు అభివృద్ధికి దూరమైందన్న అభిప్రాయం సర్వత్ర నెలకొని ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాండూరు మున్సిపాలిటీ వ్యవహారం అటు రాజకీయంగా ఇటు అభివృద్ధి పరంగా రాష్ట్రంలో పెద్ద అలజడిని సృష్టించిందని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాజకీయంగా కూడా చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారడం రోహిత్ రెడ్డి బిఆర్ఎస్ లోనే మిగిలిపోవడం అదేవిదంగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మనోహర్ రెడ్డి గెలవడం కూడా రాజకీయంగా ఒక మార్పు గానే ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. స్థానిక సంస్థలైన సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రశాంతమైన వాతావరణంలో నియోజకవర్గం స్థాయిలో ఎన్నికలు పూర్తయినాయి. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దే పై చేయిగా నిలిసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని సంకేతాలు వచ్చినప్పటి నుంచే తాండూరు రాజకీయాలు మారిపొయ్యాయి.

అభ్యర్థులను ముందే ప్రకటిస్తే టికెట్ ఆశించిన వారు వేరే పార్టీల వైపు చూసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ నాయకత్వం ఆచితూచి అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రణాళిక సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అధికార పార్టీకి ధీటుగా అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా సీనియర్ నాయకులతో ఆయా వార్డుల్లో ఎలాంటి విభేదాలు లేకుండా కూడా పార్టీ ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్ళింది. ఖచ్చితంగా తాండూరు బల్దియా పీఠంపై బిఆర్ఎస్ జండా ఎగరేస్తామన్న నమ్మకంతో ఆ పార్టీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు.

అయితే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఓ నేత బిఆర్ఎస్ పార్టీలో ఇటీవలే చిచ్చురాజేసినట్లుగా కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉండి కూడా రెండు సంవత్సరాలకు పైగా పార్టీ కార్యక్రమాలు సజావుగా సాగుతున్న నేపథ్యంలో సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అంచనాలకు మించి బిఆర్ఎస్ పార్టీ సర్పంచులను గెలిపించుకోగలిగిందని ఆ పార్టీ క్యాడర్ ఉత్సాహంతో ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ ప్రభావం చూయించుకోగలుగుతామన్న పార్టీ క్యాడర్ ఆశలపై ఆ నేత అరంగేట్రం నీళ్లు చల్లిందని బహిరంగంగా పార్టీ క్యాడర్ కామెంట్ చేయడం అందరి దృష్టిలో చర్చకు దారి తీస్తున్నది. అతను కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిఆర్ఎస్ లో చేరితే కచ్చితంగా బిఆర్ఎస్ లో విలువ ఉంటుందని ఎలాంటి చేరిక లేకుండా పార్టీ వ్యవహారాలలో నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబు అని పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో ఆ నేత జోక్యం చేసుకోవడంతో అగ్రనేతలు తీవ్ర అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాను తన కేడర్ కు కూడా పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సి ఉంటుందని ఒకవేళ ఆయన బీఆర్ఎస్ పార్టీకి సహాయం చేయగలిగితే ఓట్ల రూపంలో చూపించాలి తప్ప పార్టీ బీ ఫారం ల విషయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన జోక్యాన్నితాను జీర్ణించులేక పోతున్నారని తన సన్నిహితుల వద్ద ఘాటుగా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా పార్టీకి కష్ట కాలంలో పనిచేసి పార్టీ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నామని అలాంటి మమ్మల్ని కాదని పార్టీలో లేకుండా పార్టీకి సమాంతరంగా వ్యవహారం నడుపుతున్న నేత కారణంగా అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నష్టపోతే అప్పుడు తమ విలువ ఏంటో తెలుస్తుందని వారు భావిస్తున్న ప్రచారం జరుగుతుంది.


ఇది కూడా చదవండి…

