మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి
– హెచ్ఆర్‌సీ బిషప్ ఏ సీమన్
– సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మెథడిస్ట్ చెర్చిల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని రెసిడెంట్ అండ్ ప్రెసిడింగ్‌ బిషప్‌ ఆఫ్ హెచ్ఆర్‌సీ బిషప్ ఏ సిమన్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామాన్ని బిషప్‌ ఏ సిమన్ సతీమణీ లీనా గ్లోరియాతో కలిసి సందర్శించారు.
kvcs
తాండూరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ వి.కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బిషప్ ఏ సిమన్ దంపతులను సన్మానించారు. అనంతరం బిషప్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బిషప్ ఏ సిమన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తన పరిధిలో ఉన్న మెథడిస్ట్ చెర్చ్‌ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. చెర్చ్‌ల ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. మెథడిస్ట్ లకు పూర్వ వైభవం తీసుకవస్తామన్నారు. తాండూరులోని విలియమూన్ ఆస్తుల పరిరక్షణకు తోడ్పాటుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ చారి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కోటపల్లి అంజయ్య, శంకర్, భీమయ్య, గోపాల్, క్రిస్టియన్ మైనార్టీ డిస్టిక్ సూపరిండెంట్ జనార్దన్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

మట్టి వినాయకుడికే జై కొడదాం..!