య‌మ డేంజ‌ర్‌గాళ్లు ఈ బుడ్డోళ్లు..!

క్రైం తాండూరు రంగారెడ్డి వికారాబాద్

య‌మ డేంజ‌ర్‌గాళ్లు ఈ బుడ్డోళ్లు..!
– గంట వ్య‌వ‌ధిలో రెండు సైకిళ్ల చోరీ 
– సీసీ కెమెరాల‌తో న‌మోదైన దృశ్యాలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: కొంత‌మంది చిన్నారుల‌కు పేయింటింగ్ వేయ‌డం అల‌వాటు, ఇంకొంత‌మందికి డ్యాన్స్‌లు వేయ‌డం స‌రదా. ఇలా చిన్నారుల్లో ఏదో ప్ర‌తిదాగిఉంటుంద‌ని, అది బ‌య‌ట‌ప‌డిన‌ప్పుడు అంద‌రు అభినందిస్తుంటారు. మంచి విష‌యాల్లో అయితే ఇలాంటి సంద‌ర్భాల‌ను చూస్తాం. అదే కొంటె చేష్ట‌లు, చెడు ప‌నులు చేస్తే య‌మ డేంజ‌ర్‌గాళ్లు అంటారు. స‌రిగ్గా ఇలాంటి చిన్నారుల‌ను గ‌మ‌నించిన స్థానికులు ముక్కున వేళ్లేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి శివాజీ చౌర‌స్తా నుంచి విజ‌య‌విద్యాల‌య స్కూల్ రోడ్డుమార్గంలోని వాల్మీకీన‌గ‌ర్ ఎంపీటీ హాల్ మ‌లుపు వ‌ద్ద ఓ కంప్యూట‌ర్ సెంట‌ర్ ఉంది. దాని ముందు ఉంచిన సైకిళ్ల‌ను ఇద్ద‌రు బుడ‌త‌లు చాక‌చ‌క్య త‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ ఎత్తుకెళ్లారు. ముందుగా ఇద్ద‌రు పిల్ల‌లు ఒకే సైకిళ్‌పై వ‌చ్చి షాపు ముందు త‌చ్చాడుతూ ఉండ‌గా అందులో ఓ పిల్లాడు షాపు ముందుకు వెళ్లి నిలిపిన సైకిళ్ల‌ను ఎత్తుకెళ‌తాడు. ఇలా గంట వ్య‌వ‌ధిలో మ‌ళ్లీ వ‌చ్చి మ‌రో సైకిళ్‌ను ఎత్తుకెళ‌తాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు న‌మోదు కావ‌డంతో చిన్నారుల‌ను చూసి య‌మ‌డేంజ‌ర్ గాళ్లురా బాబు వీళ్లు అంటూ కితాబిస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి చిన్నారులపై త‌ల్లిదండ్రులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని స్థానికులు వాపోతున్నారు. అయితే ఈ చిన్నారులు.. ఎవ‌రు..? ఎక్క‌డివారు..? అనేది తేలాల్సి ఉంది.
వీడియో లింక్‌ను క్లిక్ చేయండి