ఇరుముడి ప్రియనే.. అయ్యప్పా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇరుముడి ప్రియనే.. అయ్యప్పా..!
– భక్తిశ్రద్దలతో అయ్యప్ప ఇరుముడి
– శబరికి బయల్దేరిన స్వాములు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇరుముడి ప్రియనే.. శరణం అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం మార్మోగింది. సోమవారం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 41 రోజులుగా అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి గురు స్వామితో పాటు తాండూరు లోని పలు ఆశ్రమాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఇరుముడి తీసుకొని శబరికి బయలుదేరారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాముల పెట్టతుల్లి నృత్యాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం శబరికి బయల్దేరుతున్న స్వాములను భక్తులు దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు, అయ్యప్ప భక్తులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

అప్పులున్నా.. ఆగేది లే..!