బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిందే..!
– అప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
– బీసీ యూత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని, అప్పుడే ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వహాక అధ్యక్షులు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మెనిఫెస్టోలో సమగ్ర కుల గణన చేపడతామని చెప్పిందని, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తుచేశారు.

అదేవిధంగా జీఓ 26, రూ. 150 కోట్ల బడ్జెట్ను విడుదల చేశారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడిన ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని అన్నారు. కుల గణన చేయకుండా, బీసీ రిజర్వేషన్లను పెంచకుండా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు రాజకీయంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు ఆర్థికంగా లేరని గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు టిక్కెట్లు ఇవ్వలేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా బీసీ రిజర్వేషన్లను పెంచి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

ఆకలి తీర్చడం అభినందనీయం..!