మరో మూడు నెలలు ఉచిత రేషన్
– కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం
– డిసెంబర్ వరకు పంపిణీ అమలు
దర్శిని డెస్క్ : కేంద్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2020 ఏప్రిల్‌లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మహమ్మారి రెండో దశ విజృంభణ నేపథ్యంలో పథకాన్ని పలుమార్లు పొడిగించిన సంగతి కూడ తెలిసిందే. ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమం ఈనెల ముగుస్తుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి నెలకు రూ.5కేజీల చొప్పున కేంద్రం ప్రతి నెలా ఉచిత రేషన్ అందిస్తోంది. ఇందుకోసం ఇప్పటివరకు రూ.3.4లక్షల కోట్లు ఖర్చు చేసింది. తాజాగా ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడు నెలలు పొడగించాలని కేంద్రం నిర్ణయించుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. రాబోయే పండగ సీజన్‌తో పాటు అధిక ద్రవ్యోల్బణంను దృష్టిలో పెట్టుకుని ఈ మోదీ సర్కారు నిర్ణయించింది. కేంద్ర ఖజానాపై మరో రూ.44,700 కోట్ల మేర అదనపు భారం పడినా పేదలకు ఉచిత రేషన్ పంపిణీని కొనసాగించబోతున్నట్లు వెల్లడించింది. కేంద్రం తెలిపింది. డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు.


