కోడంగల్‌లో రేవంత్ గెలుపు
– 32 వేల ఓట్ల మెజార్టీతో విజయం
– సంబరాలు చేసుకుంటున్న నేతలు, కార్యకర్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంలో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొంది కోడంగల్ సింహాసనాన్ని దక్కించుకున్నారు. అసెంబ్లీ పోరులో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై దాదాపు 32 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రేవంత్ పోటీ చేసిన రెండో స్థానం కామారెడ్డిలో కూడా రేవంత్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక్కడ కేసీఆర్, బీజేపీ అభ్యర్థి కటిపల్లి వెంకట రమణ రెడ్డి కూడా గట్టి పోటీనిస్తున్నారు. ముగ్గురి మధ్య అటు ఇటుగా ఆధిక్యం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి…

