వైభవంగా అయ్యప్ప పడిపూజ

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా అయ్యప్ప పడిపూజ
– కొత్లాపూర్‌లో మార్మోగిన మణికంఠ నామస్మరణ
– పూజకు తరలించిన భక్తులు, నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలో అయ్యప్ప పడిపూజ వైభంగా జరిగింది. గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు డా.జయదీప్ రెడ్డి, కొల్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ చైర్మన్ సందీప్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రదీప్ రెడ్డి, వెంకట్ రెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ కన్నుల పండుగలా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మద్య వారు పడిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అయ్యప్పకు అభిషేకం, అలంకరణ, మెట్ల పూజ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. ఈ సమయంలో అయ్యప్ప నామస్మరణ చేస్తూ భక్తులు అలాపించిన భజన కీర్తనలు మార్మోగాయి. అనంతరం స్వాములకు సద్ది నిర్వహించి వారు మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజకు తాండూరు మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సాయిరెడ్డి, సర్పంచులు నరేందర్ రెడ్డి, రాములు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు శ్రీనివాస్ చారి, భద్రేశ్వరాలయ చైర్మన్ బంటారం సుధాకర్, వెంకట్రామ్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తుప్పుడు శేఖర్, నాయకులు పటేల్ ఉమాశంకర్, నర్సిరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.