మూడు రోజులే టైం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మూడు రోజులే టైం..!
– స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలి
– తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి
– రోడ్లపై వ్యాపారులకు హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: మూడు రోజులలో రోడ్లపై ఆక్రమణలను తొలగించు కోవాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి వ్యాపారులకు సూచించారు.

బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం ముందు నుంచి మార్కెట్ వరకు ఉన్న ప్రాంతాలను కమిషనర్ యాదగిరి పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో ఈ మార్గంలో ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేసున్న వారితో మాట్లాడారు. రోడ్లపై వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి అని అన్నారు.

రోడ్లను ఆక్రమించడం పద్దతి కాదని అన్నారు. రోడ్ల విస్తరణను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణల తొలగింపుకు సహకరించాలని అన్నారు. మూడు రోజులలో అన్ని ఆక్రమణలు తొలగించుకోవాలి సూచించారు. ఇచ్చిన గడువులోగా తొలగించుకోక పోతే.. మున్సిపల్ ద్వారా తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు వంశీధర్, నరేష్, ప్రియ, శానిటరీ ఇనస్పెక్టర్లు వెంకటయ్య, ఉమేష్, ఈఈ ప్రవీణ్ గౌడ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

కేసులు పెట్టడం హేయం..!