డౌటే లేదు.. తాండూరు టికెట్ నాకే..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

డౌటే లేదు.. తాండూరు టికెట్ నాకే..!
– రేపు బరిలో ఉండేది కూడ నేనే
– వచ్చిన ప్రతి అవకాశంతో అభివృద్ధి
– కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గానికి ఎవరైనా రావొచ్చు.. ఎందరో వస్తుంటారు.. పోతుంటారు. కాని రేపు తాండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేది నేనే అని.. అధిష్టానం తప్పకుండా నాకే టికెట్‌ ఇస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వాఖ్యానించారు. ఆదివారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే టికెట్‌పై ఎలాంటి డౌట్‌ లేదని, కార్యకర్తలు అధైర్య పడాల్సిన పనిలేదన్నారు. టీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి అన్నింట్లో ముందున్నానని, సీఎం కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉందన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో సీనీయర్‌ నాయకులుగా, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. మంత్రిగా, ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిన ప్రతిసారి తాండూరు అభివృద్ధిలో ముందున్నానని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో సాధించిన నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తాండూరు ఎమ్మెల్యేగా టిక్కెట్ నాకే వస్తుందని నమ్మకం ఉందన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేది ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి డౌట్‌ లేదని కార్యకర్తలుకు, ప్రజలకు క్లారీటి ఇచ్చారు. మరోవైపు జనవరి నుంచి పల్లె పల్లెకు పట్నం కార్యక్రమం మెదలు పెడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, మాజీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, PACS చైర్మెన్ రవి గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత రెడ్డి, పేద్దేములు నాయకులు మాజీ సర్పంచ్ ఏర్ర బలప్ప, అంజీల్ రెడ్డి, డి వై నర్సింహులు, అంజయ కుమార్, మహిపాల్ రెడ్డి, ఇందుర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇందుర్ ప్రకాశం, ముషేనప్ప, సర్పంచుల సంఘం అధ్యక్షుడు బల్వంత్ రెడ్డి, అజిం, అరుణ్, శ్రీకాంత్, అన్వర్, హిషక్, ఎంపిటిసి శ్రీను, మాజీ సర్పంచ్ ప్రకాష్, వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య, హర్ష వర్ధన్ రెడ్డి, మదనంత పూర్ ఉప సర్పంచ్ శ్రీను, లక్ష్మణ్, తాండూరు నాయకులు సీనియర్ నాయకులు గౌడి వెంకటేష్, శ్రీకాంత్ రెడ్డి, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.