
హస్తంకు జైకొట్టిన పట్టణ ఓటర్లు
– తాండూరులో కాంగ్రెస్‌కు మెజార్టీ
– గట్టి పోటీనే ఇచ్చిన కమలం పార్టీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలల్లో మొత్తం బీజేపీ పార్టీ జోష్ కనిపించింది. అయితే జిల్లాలోని తాండూరు మున్సిపల్ పరిధిలో మాత్రం ఓటర్లు హస్తం పార్టీకే జైకొట్టారు. తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లు సాధించి ఆదిక్యతను చాటుకుంది. మంగళవారం చేవేళ్లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూరు మున్సిపల్లో సుమారు 70 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 105 నుంచి 105 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆయా పోలింగ్ కేంద్రాల వారిగా బీజేపీకి 19వేల 170 ఓట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి 20వేల 592 ఓట్లు పోలయ్యాయి.

దీంతో కాంగ్రెస్ పార్టీకి తాండూరు మున్సిపల్ నుంచి 1422 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓట్లు కలిసోచ్చాయి. ఇందిరానగర్, గొల్ల చెరువు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతం, గొల్ల చెరువు తదితర ప్రాంతాలలో ఓట్లు వచ్చాయి. ప్రభుత్వ జూనీయర్ కాలేజీ ప్రాంతం నుంచి 624 ఓట్ల లీడ్ వచ్చింది. దీంతో పాటు తాండూరు పట్టణంలోని రాజీవ్, ఇందిరమ్మ కాలనీలో కూడా హస్తం పార్టీకే అత్యధిక ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది.

ముఖ్యంగా మల్ రెడ్డిపల్లి, సాయిపూర్, ఇందిరానగర్, వీవీహెచ్ఎస్ ప్రాంతాలలో బీజేపీకి భారీ ఆధిక్యత లభించింది. మల్ రెడ్డిపల్లి నుంచి 554 ఓట్ల లీడ్ వచ్చింది. హస్తంతో పాటు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్లో మూడో స్థానానికి పరిమతం అయ్యింది. పార్లమెంట్ ఎన్నికల్లో తాండూరు మున్సిపల్ నుంచి కేవలం 1289 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో పార్టీల నేతల ఎంతో దాగి ఉందని పలువురు విశ్లేశకులు భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

