తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..
– ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూట్ నోటీఫికేషన్ జారీ అయ్యింది. ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానికలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదివారం నోటీఫికేషన్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ఆధారంగా నవంబర్ 29న పోలింగ్, కౌటింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఎన్నికల నిర్వహణకు సంబంధించి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. మరోవైపు తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్ ఫరూద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరిల పదవీకాలం జూన్ 3 వ తేదీ నాటికే ముగిసింది. తాజా నోటిఫికేషన్‌తో తెలంగాణలోని ఆశావహ నేతలు ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టారు.
