దత్తాత్రేయ భక్తుల సేవలో విఠల్ నాయక్..!
– పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నదానం
– కొన్నేళ్లుగా మహాప్రసాద వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్‌లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల సేవలో తాండూరుకు చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తరిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతితో పాటు పౌర్ణమి సందర్భంగా విఠల్ నాయక్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ప్రతి పౌర్ణమికి దత్తాత్రేయ స్వామిని దర్శించుకునే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.

అంతేకాకుండా సుమారు పదేళ్ల క్రితం నుంచి దత్తాత్రేయ స్వామి సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. శనివారం కూడా పౌర్ణమి సందర్భంగా విఠల్ నాయక్ భక్తులకు మహాప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి మరేన్నో ఉత్తమ పదవులు చేపట్టాలని మనసారా ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు.
ఇదికూడా చదవండి…

