నూట్రీషన్ కిట్లతో గర్భిణీలకు భరోసా
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో కిట్లను పంపిణీ చేసిన చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సర్కారు గర్భిణీలకు నూట్రీషన్ కిట్లను వరంగా అందిస్తోందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గర్భిణీ మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న నూట్రీషన్ కిట్ల పంపిణీ బుధవారం ప్రారంభించింది. ఇందులో భాగంగా తాండూరు పట్టణం ఇందిరా నగర్లోని ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై నూట్రీషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ, బాలింతల ఆరోగ్యం కోసం తెలంగాణ సర్కారు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. తాజాగా సూతృ మరణాలను నియంత్రించేందుకు సీఎం కేసీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూట్రీషన్ కిట్ గర్భిణీలకు వరం అని అన్నారు. ఈ పథకాన్ని గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ రవిరాజు, ప్రభాకర్ గౌడ్, మమత, బాలప్ప, వైద్య అధికారులు, ఆశ వర్కర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.

