రేణుకా ఎల్లమ్మను దర్శించుకున్న నర్సింహారెడ్డి
– కొత్లాపూర్ దేవాలయంలో ప్రత్యేక పూజలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కొత్లాపూర్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మను మాజీ మంత్రి సబితారెడ్డి సోదరుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి, ఇంద్రారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నర్సింహారెడ్డి(బాబు) దర్శించుకున్నారు.

శుక్రవారం కొత్లాపూర్‌లో రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతర ఉత్సవాల సందర్భంగా నర్సింహారెడ్డి కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో వెలసిన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా వడ్డె మాషప్ప ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఆయన వెంట నాయకులు వెంకట్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, నాగప్ప తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి..

