తెలంగాణలో వేసవి సెలవులు ఖరారు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

తెలంగాణలో వేసవి సెలవులు ఖరారు
– షెడ్యూల్‌ ప్రకటించిన రాష్ట్ర విద్యాశాఖ
– ఒంటిపూట, సెలవులు ఎప్పటి నుంచి అంటే
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. విద్యాశాఖ నుంచి షెడ్యూల్‌ విడుదల చేసింది. అందులో వేసవి సెలవులతో పాటు ఈ ఏడాది (2023) సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షలు సంబంధించిన వివరాలను కూడ వెల్లడించింది. ముందుగా విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌ ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, రెండు రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 12 నుంచి ప్రారంభంకానున్నాయి. ఇక తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి13 వరకు నిర్వహించనున్నారు. అందువల్లనే ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్ధులకు వార్షిక పరీక్షలను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 (ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెల్పింది. 1 నుంచి 5 తరగతుల విద్యార్ధులకు నాలుగు సబ్జెక్టులే ఉన్నందున ఏప్రిల్ 17తో పరీక్షలుపూర్తవుతాయి. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 20 వరకు జరీక్షలు జరుగుతాయని తెలిపింది. మరోవైపు ఎండల తీవ్రత దృష్ట్యా.. మార్చి రెండో వారం నుంచి రాష్ట్ర పాఠశాలల్లోని విద్యార్ధులకు ఒంటి పూట తరగతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 20 తరువాత పరీక్షల ఫలితాలను వెల్లడించి.. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే దాదాపు 48 రోజులు వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. తిరిగి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు తెలుపుతూ విద్యాశాఖ సూచనలు జారీ చేసింది.